యాప్నగరం

ఏపీ: సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొట్టేసే ప్లాన్.. బయటపడ్డ కుంభకోణం

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లు కొట్టేయడానికి ఓ ముఠా వేసిన పథకం బెడిసికొట్టింది. బ్యాంకు అధికారులు ఆరాతీయడం వారి మోసం బయటపడింది.

Samayam Telugu 20 Sep 2020, 9:38 am
సీఎం సహాయ నిధి నుంచి వందల కోట్లు కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నం బ్యాంకు అధికారుల అప్రమత్తతో బెడిసికొట్టింది. బ్యాంకులను బురిడీ కొట్టించి సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు దోచేయడానికి కేటుగాళ్లు ప్రయత్నించారు. బ్యాంకు అధికారుల అప్రమత్తతో ఈ కుంభకోణం బట్టబయలయ్యింది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు.. కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కత్తాలోని మూడు బ్యాంకుల ద్వారా కేటుగాళ్లు నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించారు
Samayam Telugu ఏపీ సీఎం సహాయ నిధి


వీటిపై అనుమానం రావడంతో ఆయా బ్యాంకులు వెలగపూడిలోని ఎస్బీఐని సంప్రదించాయి. దీంతో వ్యవహారం బయటపడింది. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖకు రూ.52.65 కోట్ల చెక్కు, ఢిల్లీలోని సీసీపీసీఐ కి రూ.39,85,95,540 చెక్కు, కోల్‌కత్తా సర్కిల్‌లోని మోగ్‌రాహత్‌ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్‌ కోసం గుర్తుతెలియని వ్యక్తులు సమర్పించారు.

మూడు చెక్కులు విజయవాడ, ఎంజీ రోడ్‌ బ్రాంచ్‌కు చెందినట్లుగా సృష్టించారు. వాటిపై సీఎంఆర్‌ఎఫ్, రెవెన్యూ శాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్‌ అన్న స్టాంప్‌ వేశారు. వీటిపై అధికారులు అనుమానం రావడంతో ఎస్బీఐని సంప్రదించాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా సర్కిళ్లకు చెందిన బ్యాంకుల అధికారులు ఫోన్‌ చేయడంతో నకిలీ పర్వం బట్టబయలయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.