యాప్నగరం

ఆ కారణంతోనే టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశా: గల్లా అరుణ కుమారి క్లారిటీ

గల్లా అరుణ కుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో పదవికి రాజీనామా చేయడానికి కారణాలపై పార్టీతో పాటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. దీంతో ఆమె స్పందించారు.. కారణాలను వివరించారు.

Samayam Telugu 2 Oct 2020, 9:03 am
టీడీపీ పొలిట్‌బ్యూరో పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గురువారం అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. ఆమె రాజీనామాకు కారణాలపై పార్టీతో పాటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. దీంతో ఆమె స్పందించారు.. తాను రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా తిరగలేకపోతున్నానని.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించనున్నారని.. కొత్త వారికి అవకాశమివ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
Samayam Telugu గల్లా అరుణ కుమారి


గల్లా అరుణ కుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆమె 2014లో చంద్రగిరి నుంచి మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పులివర్తి నానికి పగ్గాలు అప్పగించారు. తర్వాత అరుణకు టీడీపీ పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. ఇక ఆమె కుమారుడు జయదేవ్‌ను గుంటూరు ఎంపీ టికెట్ దక్కించుకుని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికల్లో కూడా గుంటూరు నుంచి మళ్లీ ఎంపీ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.