యాప్నగరం

AP Capital: సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ.. వివరాల వెల్లడి ఎప్పుడంటే?

ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. ఈ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిసింది.

Samayam Telugu 20 Dec 2019, 4:09 pm
రాజధాని సహా ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నేడు సీఎం జగన్‌ను కలిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిన జీఎన్ రావు కమిటీ.. సీఎంను కలిసి నివేదిక సమర్పించింది. డిసెంబర్ 27న కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం నివేదికను బహిర్గతం చేస్తారని సమాచారం.
Samayam Telugu gn rao committee


రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ మూడో వారం నుంచి పని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడంతోపాటు expertcommittee2019@gmail.com ద్వారానూ అభిప్రాయాలను సేకరించింది.

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రకటించారు. ఈ కమిటీ పూర్తి నివేదిక ఇవ్వకముందే మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో జగన్ సంకేతాలు ఇచ్చారు.

Read Also: జగన్ ‘రాజధాని’ స్కెచ్.. టీడీపీకి దెబ్బ! సీఎం మాస్టర్ ప్లాన్?

జీఎన్ రావు కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజాసంఘాలు, మేధావులు, సామాన్య ప్రజలతో చర్చించింది. డిసెంబర్ తొలి వారంలో జీఎన్ రావు కమిటీ సీఎంకు మధ్యంతర నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే సీఎం జగన్ మూడు రాజధానులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారేమో అనే వాదన కూడా ఉంది. తాజాగా జీఎన్ రావు కమిటీ పూర్తిస్థాయి నివేదికను సీఎంకు సమర్పించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదికలో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.