యాప్నగరం

గోదావరి బోటు ప్రమాద ఘటన.. ముగ్గురి అరెస్ట్

బోటు ప్రమాద ఘటనలో ముగ్గురి అరెస్ట్.. బోటు యజమాని వెంకట రమణ సహా మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు. బోటులో ప్రయాణించింది మొత్తం 75మంది అని క్లారిటీ ఇచ్చిన ఏఎస్పీ.

Samayam Telugu 20 Sep 2019, 9:00 pm

ప్రధానాంశాలు:

  • నది ప్రవాహాన్ని డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు
  • బోటును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు
  • బోటులోని వారంతా లైఫ్ జాకెట్లు వేసుకున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu asp
గోదావరి బోటు ప్రమాద ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణతో పాటూ ఏ1.. ఏ-2 ఎల్లా ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేసినట్లు రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
గోదావరిలో బోల్తాపడిన బోటులో మొత్తం 64మంది పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని ఏఎస్పీ తెలిపారు. అలాగే బోటు సిబ్బంది 8మందితో కలిపి 75మంది ఉన్నారన్నారు. బోటు డ్రైవర్‌ నది ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోవడం.. సుడుల నుంచి తప్పించడం.. సురక్షిత మార్గంలో బోటును తీసుకెళ్లడంలో అవగాహన, అనుభవం లేకపోవడమే ప్రమాదానికి కారణమన్నారు. ఎడమ పక్కకు వెళ్లాల్సిందిపోయి.. గోదావరి మధ్యలో నడిపారన్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తప్పు లేదని.. పోలీసులు తనిఖీ చేసినప్పుడు బోటులోని వారంతా లైఫ్‌ జాకెట్లు వేసుకున్నారన్నారు. పోలీసులు వెళ్లగానే లైఫ్‌ జాకెట్లు తీసేసి ఉండొచ్చని.. బోటును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ 34 మృతదేహాలు వెలికి తీసినట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.