యాప్నగరం

హథిరాంజీ మఠంలో భారీగా బంగారం, వెండి మాయం..!

తిరుపతి హథిరాంజీ మఠంలో భారీగా బంగారం, వెండి మాయమైన వ్యవహారం కలకలంరేపుతోంది.

Samayam Telugu 10 Jul 2020, 6:50 pm
చిత్తూరు జిల్లా తిరుమలలోని హథిరాంజీ మఠంలో బంగారం, వెండి వస్తువులు మాయమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. అకౌంటెంట్‌ బీరువాలోని నగల లెక్కల్లో తేడాను అధికారులు గుర్తించారు. హథిరాంజీ మఠం అకౌంటెంట్‌‌ గుర్రప్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మఠంలోని కొన్ని బీరువా తాళం చెవులు కనిపించకపోవడంతో సిబ్బంది గుర్రప్ప కుటుంబ సభ్యులను ఆరా తీశారు.
Samayam Telugu హథిరాంజీ మఠం, తిరుమల


వారు గుర్రప్ప ఇంట్లో వెతికి మఠానికి చెందిన కొన్ని తాళంచెవులు తీసుకొచ్చారు. అందరి సమక్షంలో అధికారులు బీరువా తెరిచి నగలను పరిశీలించగా.. 108 గ్రాముల బంగారు డాలర్‌, వెండి వస్తువులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నగల మాయంపై మఠం సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అప్రైజర్‌తో లెక్కకట్టి ఎన్ని నగలు పోయాయో తెలుపుతామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొందరు పూజారులపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలే పలు ప్రముఖ ఆలయాల్లో నగలు, నగదు లెక్కల్లో అవకతవకలు వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. ఇటీవలే శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు 20 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.