యాప్నగరం

తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ హరిచందన్.. ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు!

తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం దర్శించుకున్నారు. ఇక, తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 3 Oct 2022, 11:25 pm
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ హరిచందన్‌కు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన హరిచందన్‌.. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని ఆ తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత గవర్నర్‌కు అద్దాల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్‌, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Samayam Telugu తిరుమల శ్రీవారి ఆలయం


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలుదీరాడు. వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో సూర్యప్రభపై మత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం నేత్రానందంగా జరిగింది.

రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మలయప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. బ్రహోత్సవాల్లో ప్రధానంగా భావించే మహా రథోత్సవం మంగళవారం ఉదయం జరగనుంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత మహారథం మాడవీధుల్లో తిరగనుంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.