యాప్నగరం

గుంటూరు: మహిళా గ్రామ వలంటీర్ ఆత్మహత్య!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మహిళా గ్రామ వలంటీర్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 18 May 2020, 10:25 pm
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ వలంటీర్ మానుకొండ రాజేశ్వరి (26) అనే యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం గదిలోకి వెళ్లిన యువతి ఎంతకీ బయటకు రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చూశారు.
Samayam Telugu మహిళా వలంటీర్ ఆత్మహత్య


అయితే యువతి గదిలో ఉరేసుకుని ఉండటం చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తలుపులు తెరిచి చూడగా, అప్పటికే యువతి మరణించి ఉంది. గ్రామ వలంటీర్‌గా నిరంతరం ప్రజల మధ్య తిరిగే యువతి మరణించడంతో గ్రామంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

యువతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామ వలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.