యాప్నగరం

కష్టాన్ని చెప్పుకున్న దివ్యాంగుడు.. స్పందించిన సీఎం జగన్

ఇందిరా గాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన విజయవాడకు చెందిన దివ్యాంగుడు. తన కష్టాన్ని జగన్‌కు చెప్పుకున్న బాధితుడు. స్పందించిన ముఖ్యమంత్రి.. సమస్యను పరిష్కరించాలని ఆదేశం.

Samayam Telugu 15 Aug 2019, 2:49 pm
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం చివర్లో ఓ వ్యక్తి భద్రతా సిబ్బందిని దాటుకొని ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు వెళ్లాడు. దీంతో అందరూ షాకయ్యారు.. తర్వాత అసలు విషయం తెలుసుకొని శాంత పడ్డారు. అతడు తన కష్టాన్ని సీఎంకు చెప్పుకోవడానికి వచ్చాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu cm jagan.


విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తి.. ఓ ప్రమాదంలో కరెంట్ షాక్‌ తగిలి తన రెండు చేతులు కోల్పోయాడట. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన కష్టాన్ని చెప్పుకున్నాడు.. వెంటనే సెన్సార్లతో పనిచేసే కృత్రిమ చేతులను అమెరికా నుంచి తెప్పించి ఇచ్చారట. అలాగే ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారట.

దుర్గారావుకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కొద్దిరోజులకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందట.. దీంతో అతడికి ఉద్యోగం రాలేదు. అప్పటి నుంచి ఉద్యోగం విషయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు తన కష్టాన్ని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడైనా తనకు ఉద్యోగం ఇప్పించాలని జగన్‌కు విజ్ఞ‌ప్తి చేశాడు. స్పందించిన జగన్ దుర్గారావు సమస్యను పరిష్కరించాలని కార్యదర్శి ధనుంజయ రెడ్డికి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.