యాప్నగరం

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌

వరదనీరు రైల్వే ట్రాక్‌ పై నుంచి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మధ్య నడిచే సరకు రవాణా రైళ్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Samayam Telugu 11 Jun 2020, 4:39 pm
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు జిల్లాలో వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం వద్ద రాత్రి కురిసిన వర్షానికి రైల్వే ట్రాక్‌ మొత్తం దెబ్బతింది. వరద నీరు పొంగి పొర్లడంతో రైల్వే పట్టాలు కూడా కనిపించకుండా పోయాయి. వరదనీరు రైల్వే ట్రాక్‌ పై నుంచి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు మధ్య నడిచే సరకు రవాణా రైళ్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Samayam Telugu ప్రకాశం జిల్లాలో వర్షాల ఎఫెక్ట్


మరోవైపు భారీ వర్షాలకు కంభం-సోమిదేవిపల్లి మార్గమధ్యలో రైల్వే స్తంబాలు కూలిపోయాయి. గుంటూరు-గుంతకల్లు రైల్వే లైనులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైలు పట్టాలపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. పలుచోట్ల రైల్వే లైన్లు కోతకు గురయ్యాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.