యాప్నగరం

కర్నూలులో డిగ్రీ చదవుతున్న మహేష్‌బాబు!

కర్నూలు జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం జాబితాలో మహేష్‌బాబు. విద్యార్థుల ఫోటోల బదులు మహేష్ ఫోటో ప్రత్యక్షం కావడంతో షాక్.. రెండుచోట్ల ఇలాంటి తప్పే జరిగింది.

Samayam Telugu 26 Feb 2020, 1:33 pm
అదేంటి మహేష్‌బాబు డిగ్రీ చదవడం ఏంటని షాకవుతున్నారా.. నిజమే కర్నూలు జిల్లాలో డిగ్రీ చదువుతున్నారట. ఆయను విద్యా దీవెన పథకం కింద కార్డు కూడా జారీ అయ్యింది. అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు. అసలు విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.. అర్హులైన విద్యార్థులకు కార్డుల్ని పంపిణీ చేశారు.
Samayam Telugu prince


ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కార్డులో సినీ హీరో మహేష్ బాబు ఫోటో ప్రత్యక్షమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా మహేష్ బాబు ఫొటో వచ్చింది. ఆ కార్డు చూసిన విద్యార్థిని షాకైంది. వెంటనే విషయాన్ని సచివాలయ ఉద్యోగులకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

మరోచోట కూడా మహేష్ విద్యార్థి ఫోటో స్థానంలో మహేష్‌బాబు ఫోటో ప్రత్యక్షమైంది. ఆ విద్యార్థి కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్డుల జారీలో ఇలా లోపాలు బయటపడటంతో అధికారులు కూడా షాక్ తిన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆరా తీస్తున్నారు. విద్యార్థులు పొరపాటున ఫోటోలను మార్చి అప్‌లోడ్ చేశారా.. లేక ప్రింటింగ్ సమయంలో ఎక్కడైనా పొరపాటు జరిగిందా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
అంతేకాదు ఇటీవల కర్నూలు కార్పొరేషన్‌ ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమైంది. ఆ ఘటనను మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు విద్యా దీవెన పథకం కార్డుల్లో తప్పులు దొర్లాయి. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.