యాప్నగరం

కర్నూలు: ఓటర్ లిస్ట్‌లో హీరో వెంకటేష్, కుక్క ఫోటోలు

కర్నూలులో విచిత్రం.. ఓటర్ల జాబితాలో మహిళా ఓటరు బదులు హీరో వెంకటేష్ ఫోటో. మరోచోట ఓటర్ ఫోటో బదులు కుక్క ఫోటో.. షాక్ తిన్న అధికారులు.. ఫోటోలు సరిదిద్దే పనిలో ఉన్నారు.

Samayam Telugu 10 Feb 2020, 10:20 am
కర్నూలులో ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో ప్రత్యక్షమయ్యింది. ఇదేం విచిత్రమని షాకవ్వకండి నిజమే.. ఓ మహిళ బదులు హీరో ఫోటో ప్రింట్ అయ్యింది. ఇటీవల విడుదలైన ఓటర్ లిస్ట్‌లో ఈ ఫోటో చూసి షాక్ తిన్న అధికారులు తప్పు జరిగిందని గమనించారు.. సరిదిద్దుకునే పనిలో ఉన్నారు.
Samayam Telugu venki


కర్నూలు నగర పాలక సంస్థ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మహిళా ఓటరుకు బదులుగా సినీ నటుడు వెంకటేష్ ఫోటో వచ్చింది. నగరంలోని 31వ వార్డులో మహిళలకు సంబంధించిన వివరాలు సరిగానే ఉన్నాయి.. కానీ ఫోటో మాత్రం మారిపోయింది. తప్పును గమనించిన కొందరు అధికారుల్ని సంప్రదించారు. జాబితాలో మరికొన్ని తప్పులు దొర్లాయని.. వాటిని కూడా త్వరలోనే సరిచేస్తామంటున్నారు అధికారులు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కంగారుపడాల్సిన పనిలేదంటున్నారు. ఇదిలా ఉంటే మరోచోట ఓటర్ ఫోటో బదులు కుక్క ఫోటో ప్రింట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.