యాప్నగరం

ఏపీలో ఓ వైపు ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి.. ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయి

Ap Weather Update ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటలకే హీట్ మొదలవుతోంది.. కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోత, వేడి గాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే వాాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.. ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోసర్తు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 May 2023, 2:19 pm

ప్రధానాంశాలు:

  • నిప్పుల కొలిమిలా మారిన ఏపీ
  • రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
  • పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap High Temperatures
Ap Weather Today: ఏపీలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే వణికిపోయేలా ఎండలు మండిపోతున్నాయి. ఎండకు తోడు వేడిగాలులు, ఉక్కపోత దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు కూడా రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇవాళ మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు,ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తలు నిర్వహణ సంస్థ తెలిపింది.
మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బుధవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 46°C, తిరుపతి జిల్లా ఏర్పేడులో 46°C,పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప, వీరపనాయునిపల్లె, వల్లూరు,ముద్దనూరు, మండల్లాలో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 41 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. గురు, శుక్రవారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని.. గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ.

Andhra Rains: మురోవైపు ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయంటున్నారు. నైరుతి రుతుపవనాలు శుక్రవారంలోగా దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా గురువారం నుంచి ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు. మరోవైపు ఏపీలో ఉక్కుపోత, ఎండలు దంచికొడుతుండటంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు.
రెండు వారాల క్రితం కూడా ఏపీలో వర్షాలు కురిశాయి. ఉరుములు, పిడుగులతో తేలికపాటి నుంచి భారీగా వానలు పడ్డాయి. దీంతో సమ్మర్‌లో కూల్ వాతాావరణాన్ని జనాలు ఎంజాయ్ చేశారు. రైతులు మాత్రం అకాల వర్షాలతో కష్టాల్లో పడ్డారు. పంటనష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ధాన్యం వర్షానికి తడవటంతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మామిడి, అరటి, నిమ్మతో పాటూ మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. ఆ వెంటనే మళ్లీ ఎండలు మొదలయ్యాయి.. వారం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఇటు తెలంగాణ కూడా వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.