యాప్నగరం

మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు.. ఒక్క సైగ చేస్తే.. వైసీపీకి బాలయ్య వార్నింగ్

YS Jagan సర్కారకు బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దన్న ఆయన.. తాను ఒక్క సైగ చేస్తే చాలన్నారు. తాము సహనం పాటించామన్నారు.

Samayam Telugu 31 Jan 2020, 1:23 pm
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. తన నియోజకవర్గంలో.. వైసీపీ కార్యకర్తలు తనను అడ్డుకోవడంపై బాలయ్య ఫైరయ్యారు. ఇలాంటి విష సంస్కృతి ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదన్నారు. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని బాలయ్య హెచ్చరించారు. తాను ఒక్క సైగ చేస్తే చాలన్నారు. కేవలం 20 మంది వైసీపీ కార్యకర్తలు తమకు అడ్డుతగిలారని.. వెంటనే తమ వాళ్లు వెయ్యి మంది కార్యకర్తలు వచ్చారన్నారు. అయినా సహనం పాటించామన్న బాలయ్య.. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించొద్దన్నారు. ఏం చేస్తున్నారో వాళ్లే ఈ విషయం తెలుసుకోవాలన్నారు.
Samayam Telugu balaih


ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందన్న బాలయ్య.. రామారావు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారన్నారు. ఇప్పుడు అనేక దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును చూసి నవ్వుకుంటున్నారన్నారు.
శాసన మండలి పరిణామాలపై స్పందిస్తూ.. వైసీపీ తీరును బాలయ్య ఖండించారు. మండలి చైర్మన్ పదవికి గౌరవం ఇవ్వాలన్నారు. మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయిస్తే.. మండలిని రద్దు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందన్నారు. ఈ తీర్మానాన్ని ఆమోదించే సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యే సభలో లేరని.. ఓటింగ్ సమయంలో తలుపులు మూశారని, మళ్లీ తమవాళ్లను రప్పించడం కోసం తలుపులు తెరిచారని బాలయ్య ఆరోపించారు.

మూడు రాజధానుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన సాగుతోందని బాలయ్య విమర్శించారు. వైఎస్ మండలిని పునరుద్ధరిస్తే.. జగన్ రద్దు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.