యాప్నగరం

రచ్చరచ్చ చేసిన రేసుగుర్రం.. భారీగా పోలీసుల మోహరింపు.. శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తం

గుర్రపు పందేలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీశాయి. రేసుగుర్రాలు వేగంగా దూసుకురావడంతో ప్రమాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది.

Samayam Telugu 17 Nov 2019, 3:09 pm
రేసుగుర్రాలు రోడ్డుపై పరుగులు తీయడం శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీసింది. రిసార్ట్‌లో రేసింగ్‌కి స్థలం ఉన్నప్పటికీ నిర్వాహకులు రోడ్డుపై రేసులు నిర్వహించడమే కారణంగా తెలుస్తోంది. వేగంగా దూసుకొచ్చిన ఓ రేసుగుర్రం బైక్‌ని ఢీకొట్టడంతో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డుపై రేసులతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో భారీగా పోలీసులను మోహరించారు.
Samayam Telugu horse


రాజాం మండలం కంచారంలోని తృప్తి రిసార్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రపు పందేలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రిసార్ట్‌లో రేసుల కోసం స్థలం ఉన్నప్పటికీ రోడ్డుపై నిర్వహించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న కోరాడ రాంబాబు, రమాదేవి దంపతులను వేగంగా వచ్చిన రేసుగుర్రం బలంగా ఢీకొట్టడంతో కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

Also Read: చెంప చెళ్లుమనిపించిన ఎస్సై.. తిరిగికొట్టిన గొర్రెల కాపరి.. అసలేమైందంటే!

రిసార్ట్ యాజమాన్యం నిర్వాకం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో రిసార్ట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిసార్ట్‌లో ట్రాక్ ఉన్నా రోడ్డుపై పందేలు నిర్వహించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నడిరోడ్డుపై గుర్రపు స్వారీలేంటని నిలదీశారు. పరిస్థితి చేయిదాటుతోందని భావించిన పోలీసులు అప్రమత్తమై భారీగా బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: పవన్‌ని అలా అన్నాక ఆలోచించుకున్నా.. సాదినేని యామిని సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.