యాప్నగరం

శ్రీశైల దేవస్థానంలో భారీ కుంభకోణం.. రూ. కోట్లలో గోల్‌మాల్

శ్రీశైలం దేవస్థానంలో మరో భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు.

Samayam Telugu 25 May 2020, 7:49 pm
కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకుల తరఫున పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు వెల్లడించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయని పేర్కొన్నారు.
Samayam Telugu శ్రీశైలం దేవస్థానం


Also Read: టీటీడీ భూములు అమ్మట్లేదు.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన

బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు ఈవో కేఎస్‌ రామారావు వెల్లడించారు. గత జనవరి నెలలోనూ ఇలాంటి ఘటనే శ్రీశైలం దేవస్థానంలో వెలుగు చూసింది. విరాళ కేంద్రంలో పనిచేసే ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు రూ.80 లక్షలు స్వాహా చేశారు.

కాగా, శ్రీశైలం దేవస్థానంలో ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కర్నూలు ఎస్పీతో మాట్లాడారు. తక్షణమే నగదు రికవరీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నగదు రికవరీకి చర్యలు చేపట్టాలన్నారు.

Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.