యాప్నగరం

అది తేలితే జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు శనివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 15 Aug 2020, 3:31 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నరసాపురం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు షాక్‌కు గురిచేశాయన్నారు. ఇదే నిజమని తేలితే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఎంపీ రఘురామ ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. అధికార వైసీపీ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది ఆరోపించారు.
Samayam Telugu వైఎస్ జగన్
ys jagan


మా మాదిరిగానే న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరిగినట్లు తేలితే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తాయని ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ రఘరామ డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కౌంటర్ఇకపై తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సీటు కోసం తాను ఎవరి కాళ్లు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంటే తనకు అపార గౌరవం ఉందని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడి వివరించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో బీజీగా ఉంటారేమోనని తాను భావించానని, అయితే డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన్ను ఏ జిల్లాలోనూ జెండా వందనంలో పాల్గొనేందుకు ప్రభుత్వం నియమించలేదని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా జెండా వందనంలో పాల్గొనపోవడంపై ఆయనకు బాధగా లేదేమో గాని, తాను మాత్రం తీవ్రంగా బాధపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. తన విషయంలో డిప్యూటీ సీఎం సంయమనం పాటించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.