యాప్నగరం

నీట్, జేఈఈ విద్యార్థులకు శుభవార్త: ఈ లింక్ క్లిక్ చేసి ప్రాక్టీస్ టెస్టులు రాయొచ్చు!

జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నీట్, ఐఐటీ- ఫోరం గుడ్ న్యూస్ చెప్పింది.

Samayam Telugu 11 Dec 2020, 11:18 pm
జాతీయ ప్రవేశ పరీక్ష (2021)లకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఐఐటీ- జేఈఈ ఫోరం శుభవార్త చెప్పింది. విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్) ‘కోటా’ ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులను సిద్ధం చేసినట్లు ఐఐటీ- జేఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇంటి వద్దే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్ ద్వారా పరీక్షలు రాసుకునే విధంగా ప్రాక్టీస్ టెస్టులు తీర్చిద్దామన్నారు.
Samayam Telugu ఆన్‌లైన్ పరీక్ష


అపరిమితమైన మాక్, ప్రాక్టీస్ పరీక్షలు, గ్రాండ్ టెస్టులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు లలిత్ కుమార్ చెప్పారు. వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి 2021 పరీక్షలు ప్రారంభం అయ్యే వరకు రాసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. టెస్ట్ సిరీస్ రాసిన అనంతరం ఆలిండియా ర్యాంక్ కూడా తెలుసుకోవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి పరీక్షలు రాసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం 9849016661 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.