యాప్నగరం

అంతర్వేది ఘటనపై మంత్రి సీరియస్.. విచారణ కమిటి ఏర్పాటు

అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి వెల్లంపల్లి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Samayam Telugu 6 Sep 2020, 10:38 am
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని రథం గత రాత్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ సమాచారం తెలిసిన దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి... దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, జిల్లా ఎస్సితో ఫోన్ మాట్లాడారు. స‌హ‌య‌క చ‌ర్యులు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో కూడా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
Samayam Telugu అంతర్వేది రథం దగ్ధంపై విచారణ కమిటీ
Inquiry committee on antervedi chariot burning


ఈ ఘటనపై విచార‌ణ అధికారిగా దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌ మోహ‌న్‌ను నియ‌మించారు. ఈ పనికి పాల్పడిన వారిపై కఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, దేవ‌దాయ శాఖ అధికారుల‌తో పాటు పోలీసులు సంబంధిత అధికారుల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను అదేశించారు. అంతే కాకుండా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం పున నిర్మాణానికి చ‌ర్యులు చేప‌ట్టాల‌ని దేవ‌దాయ క‌మిష‌న‌ర్‌కు మంత్రి వెల్లంపల్లి సూచించారు.

Read More: అగ్నికి ఆహుతైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం

ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి రథం అగ్నికి ఆహుతయ్యింది. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.