యాప్నగరం

'నువ్వు మళ్లీ తప్పకుండా గెలవాలన్నా'.. టీడీపీ ఎమ్మెల్యేతో మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర సంభాషణ

Payyavula Keshav మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పాత సెంటిమెంట్‌ను పరోక్షంగా గుర్తు చేస్తూ పేర్ని నాని ప్రస్తావించగా.. కేశవ్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. 1994 ఎన్నికల ఫలితాలు 2024లో రిపీట్ అవుతాయంటూ పయ్యావుల రిప్లై. ఇద్దరి మధ్య అసెంబ్లీ లాబీల్లో జరిగిన సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి పయ్యావుల కేశవ్, పేర్ని నానిల్లో ఎవరి మాట నిజమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 Mar 2023, 12:58 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ
  • పయ్యావుల మళ్లీ గెలవాలన్న నాని
  • పాత సెంటిమెంట్‌ను గుర్తు చేస్తూ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Perni Nani
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (Ap Assembly Session) తొలిరోజు ఆసక్తికర సంభాషణ జరిగింది. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడింది.. లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Mla Payyavula Keshav), మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)లు ఎదురుపడ్డారు. ఇద్దరు ఒకొరినొకరు పలకరించుకున్నారు.. బావున్నారా అంటూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశవ్‌ మళ్లీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్ని నాని నవ్వుతూ అన్నారు.
ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్న సెంటిమెంట్‌ని నాని పరోక్షంగా గుర్తు చేశారు. మాజీ మంత్రి ఉద్దేశం అర్థం చేసుకున్న కేశవ్‌.. 'నో డౌట్‌... 1994 ఎన్నికల ఫలితాలే 2024లోనూ రిపీట్‌ అవుతాయి' అంటూ స్పందించారు. 1994లో తెదేపా ఉరవకొండలోను గెలిచి, రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చిన విషయాన్ని కేశవ్ నానికి గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచిన సమయంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు.

మరోవైపు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌. రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించామని.. ప్రశ్నోత్తరాలు, బడ్జెట్‌పై చర్చలను ఉపయోగించుకుంటామన్నారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవలేమోననే భయం ముఖ్యమంత్రికి మొదలైందని.. పార్టీలు మారితే ఆటోమేటిక్‌గా పదవులు పోతాయన్న జగన్‌.. మారిన నలుగురిని అనర్హులుగా ప్రకటించగలరా అని కేశవ్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌ సమావేశంలో ఈ జులైకి విశాఖ వెళ్లనున్నట్లు మంత్రులకు చెప్పారని.. అసలు చెప్పాల్సిన శాసనసభ గవర్నర్‌ ప్రసంగంలో ఎందుకు ఈ అంశాన్ని చేర్చలేదని ప్రశ్నించారు. మూడు రాజధానుల గురించి పదేపదే ప్రకటనలు చేసే సీఎం జగన్‌, మంత్రులు.. గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం రాజధాని అంశంపై ఎందుకు స్పష్టతనివ్వలేదో చెప్పాలన్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడబోనని గవర్నర్‌ వారికి ఏమైనా చెప్పారా.. సీఎం క్లారిటీ ఇవ్వాలన్నారు.

అసెంబ్లీ గవర్నర్‌ ప్రసంగంలో అబద్ధాలు, అసత్యాలు, చేయని పనులను చేసినట్టు గొప్పలు చెప్పారని ధ్వజమెత్తారు. గతంలో అప్పుల కోసం పాత గవర్నర్‌తోనూ పూచీ పెట్టిన జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త గవర్నర్‌ స్థాయి తగ్గించారన్నారు. అవర్‌ డైనమిక్‌ చీఫ్‌ మినిస్టర్‌ అంటూ గవర్నర్‌తో పొగిడించడం చట్టసభల చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తితో అమల్లో లేని, చట్టం కాని దిశపైనా అసత్యాలు చెప్పించారన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.