యాప్నగరం

అనంతపురం కలెక్టర్‌గా బాలిక... ఇవాళ ఒక్కరోజే స్పెషల్‌గా

బాలికే భవిష్యత్తు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో బాలికలకు ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. సాయంత్రం 6 గంటల వరకు పదవిలో బాలికలే ఉండనున్నారు.

Samayam Telugu 11 Oct 2020, 2:24 pm
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒక రోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
Samayam Telugu అనంత కలెక్టర్‌గా బాలిక
anantapur collector


చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోంది. ఆమె పక్కనే చంద్రుడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలికే ఉండనున్నారు. అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.

international girls day


శ్రావణి ఇంటర్మీడియట్ చదువుతోంది. కె.జి.బి.వి. గార్లదిన్నెలో విద్యను అభ్యసిస్తోంది. ఒక రోజు బాధ్యతలు స్వీకరించిన సహస్ర 7వ తరగతి, ప్రసాద్ స్కూల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఏడవ తరగతికి చదువుతున్న సహస్ర అనే విద్యార్థి ఎంపికయ్యింది. ఐదవ తరగతి చదువుతున్న నేత్రశ్రీ డి ఆర్ ఓగా ఒక రోజు బాధ్యతలు స్వీకరించింది. 8వ తరగతి చదువుతున్న సమీర కలెక్టరేట్ ఏవో గా ఒక రోజు బాధ్యతలు స్వీకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.