యాప్నగరం

Sankranti: తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: జగన్, చంద్రబాబు

Sankranti: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అని.. ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకున్నారు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా.. అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 13 Jan 2023, 5:56 pm
Sankranti: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Samayam Telugu Sankranti
సంక్రాంతి


'సంక్రాంతి పల్లెల పండుగ. రైతుల పండుగ. మన అక్కచెల్లెమ్మల పండుగ. మొత్తంగా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలి. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలి. పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో.. ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలి' అని ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) ఆకాంక్షించారు.

'ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా పేదలకు పండుగ కానుకలను ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికాం. సంక్రాంతి కానుకతో పాటు రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకు కూడా మొత్తం కోటిన్నర కుటుంబాలకు పండుగ కానుకను ఇచ్చాం' అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.