యాప్నగరం

జనసేన, బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

జనసేన, బీజేపీ సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. రాజధాని రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఇరు పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 25 Jan 2020, 7:50 pm
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా ఫిబ్రవరి 2న నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ వాయిదా పడింది. రాష్ట్ర రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. దీన్ని బీజేపీ కూడా ధ్రువీకరించింది. అయితే ఈ క్రమంలో లాంగ్‌మార్చ్‌ వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం శనివారం ప్రకటించారు.
Samayam Telugu press


అయితే త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని నాగభూషణం వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలని బీజేపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వంతో సైతం పవన్ సంప్రదింపులు జరిపారు.

ఈ నెల 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ, జనసేన బృందం భేటీ అయింది. అనంతరం రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న రాజధాని అమరావతి రైతుల తరఫున విజయవాడలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ఇరు పార్టీలు ప్రకటించాయి. అయితే ఇంతలోనే వాయిదా వేసినట్లు ప్రకటించారు.

Also Read: ఎవరినీ వదలం.. నోటీసులకు సిద్ధంగా ఉండండి.. జనసేన హెచ్చరికలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.