యాప్నగరం

భాషను కాపాడుకుందాం.. పవన్ కళ్యాణ్ పిలుపు

మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని.. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 23 Nov 2019, 7:23 pm
మాతృ భాషను, నదులను పరిరక్షించుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'మన నుడి... మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు సిద్ధమయ్యారు పవన్. మన నుడి - మన నది కార్యక్రమానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. జనసేన చేపట్టిన ఉద్యమానికి అమూల్యమైన సలహాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు.
Samayam Telugu Jana Sena Pawan Kalyan


ప్రపంచీకరణ నేపథ్యంలో జాగ్రత్త పడకపోతే తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాషను, సంస్కృతిని నిర్లక్ష్యం చేసినా.. అవహేళన చేసినా వేర్పాటువాదం పుట్టుకొస్తుందని.. తెలంగాణ ఉద్యమ అనుభవాలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అలాగే జలవనరులు కలుషితమైపోతున్నాయని.. నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు భాషను, నదులను కాపాడుకునేందుకు జనసేన సంకల్పించిందన్నారు.

Also Read: ఆ ‘టచ్’ వేరే సుజనా.. వైసీపీ ఎంపీ రఘురామ స్ట్రాంగ్ కౌంటర్

నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో బోలెడు రుజువులు కనిపిస్తాయి. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మన భవితకు ప్రాణాధారమైన అమ్మ నుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నాం. మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మన నుడినీ, మన నదినీ కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించామని పవన్ తెలిపారు. మాతృ భాషను పరిరక్షించుకోవాలి.. మన నదులను కాపాడుకోవాలన్న ఆయన.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా “మన నుడి... మన నది” కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకంటించారు. అందులో భాగంగా ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు పవన్ సమాయత్తమయ్యారు. సలహాలు, సూచనలు అందజేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

Read Also: బెజవాడకు బంగ్లాదేశ్ యువతులు.. వ్యభిచారం కోసం విమానాల్లో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.