యాప్నగరం

'YS Jagan గారూ.. సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోలేకపోయారా'

Pawan Kalyan| వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇన్ని రోజులైనా నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారన్న పవన్.

Samayam Telugu 14 Sep 2019, 3:25 pm

ప్రధానాంశాలు:

  • కుటుంబ సభ్యుల విషయంలో చర్యలు తీసుకోరా
  • వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకోలేపోయారు
  • దోషుల్ని పట్టుకోవాలి.. లేకపోతే సీబీఐకి అప్పగించాలి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jagan..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనపై నివేదికను విడుదల చేసింది జనసేన పార్టీ. అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచారు. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్పందించారు. పోలవరం, రాజధాని, ఇసుక పాలసీ, మద్యపాన నిషేధం.. ఇలా ప్రతి అంశంపై పార్టీ అభిప్రాయాన్ని తెలియజేశారు.
Read Also: 8 ఏళ్ల చిన్నారి లేఖ.. స్పందించిన సీఎం జగన్

సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద హత్యకేసు పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. గతంలో ముఖ్యమంత్రి గారిపై కోడి కత్తితో దాడి చేసిన వ్యక్తిని అధికారంలోకి రాగానే విడుదల చేసారు.. అతను తప్పు చేశాడా లేదా.. సొంత బాబాయ్‌ని హత్య చేసిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారు.. సొంత కుటుంబ సభ్యుల విషయంలో కూడా చర్యలు తీసుకోలేరా అంటూ ప్రశ్నించారు జనసేనాని.

ఈ రెండు హత్యకేసుల విషయంలో ఇంతవరకు ఏమీ తేల్చలేదన్నారు జనసేన అధినేత. ఈ రెండు ఉదంతాలపై పోలీసుశాఖ దృష్టిసారించాలి. కోడి కత్తి దాడి అంశం, వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి దోషులను పట్టుకోవాలన్నారు. లేని పక్షంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి కేసును సీబీఐకి అప్పజెప్పాలని పిలుపునిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.