యాప్నగరం

ఏపీలో 2024కు ముందే ఎన్నికలు: జమిలికి రెడీ.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Janasena: ఏపీలో 2024కు ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 18 Nov 2020, 8:02 pm
ఆంధ్రప్రదేశ్‌లో 2024 కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలన్నదే తన అభిప్రాయం అని వ్యాఖ్యానించారు. నాయకత్వ లోపం కారణంగా అభిమానులు పార్టీ వైపు రావడం లేదని వ్యాఖ్యానించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


వైసీపీకి ప్రజలు అత్యధిక సీట్లిచ్చి గౌరవించారని.. కానీ ఆ పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకొనే పరిస్థితుల్లో లేదదని ఆయన విమర్శించారు. 2014లో ఏపీ ప్రయోజనాల కోసమే వేరే పార్టీలకు మద్దతిచ్చానని ఆయన చెప్పారు. కానీ, అలాంటి టీడీపీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతోందన్నారు.

అలాగే అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్ కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమకారులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా? అని పవన్‌ ప్రశ్నించారు. ఉద్యమానికి, సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేసేదిలేదని పవన్‌ స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ తనకు స్పష్టంగా చేప్పిందన్నారు. రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదని, అధికారికంగా ప్రకటించాక మా పార్టీ కార్యాచరణ చెబుతామని పవన్‌ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.