యాప్నగరం

ఈ ప్రశ్నలకు బదులేది.. జగన్‌కు 'పవర్' పంచ్

YS Jagan| 'ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారు. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది కూల్చివేతలు,టెండర్ల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్లని రోడ్లపైకి తేవడం, కేసులు, రాజధాని లేకుండా చెయ్యటం'

Samayam Telugu 30 Sep 2019, 6:38 pm
ఏపీని విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. తాజాగా విద్యుత్ కోతలపై జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.
Samayam Telugu సీఎం జగన్


Read Also: కోడెల అప్పుడే నా దగ్గరకు వచ్చారు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’అన్నారు పవన్ కళ్యాణ్.
ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా అంటూ ప్రశ్నించారు. 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు.. అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది అన్నారు. సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారని విమర్శించారు.

Also Read: జగన్ సర్కార్ దూకుడు.. వైసీపీ నేతలకు శుభవార్త

ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారని పవన్ ఆరోపించారు. 2019 సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్.. ఈ నెల 29న థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే అన్నారు జనసేన అధినేత.

ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారని.. కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు చేస్తారన్నారు పవన్. ‘కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్లని రోడ్లు మీదకి తీసుకురావటం, కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం’అంటూ ధ్వజమెత్తారు. మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుందని చురకలంటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.