యాప్నగరం

BJP కి పవన్ కళ్యాణ్ బిగ్ షాక్.. ఆ ఉద్యమంలోకి జనసేన..!

బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిగ్ షాకిచ్చారు. విశాఖపట్నం ఉక్కు ఉద్యమంలోకి జనసేనాని ఎంట్రీ ఇచ్చారు.

Samayam Telugu 20 Sep 2021, 12:30 am
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి జనసేన అధినేత బిగ్ షాకిచ్చారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరికాదని, ఈ కర్మాగారం భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయంలో జనసేన పార్టీ చాలా స్పష్టతతో ఉందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మొదటి నుంచి అదే స్టాండ్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ విశాఖపట్నం వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్



తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంపై దేశం మొత్తం మాట్లాడేలా ముందుకు వెళ్లాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులతో జనసేన నేతలు ఆదివారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై 220 రోజులుగా తాము చేస్తున్న పోరాటాన్ని వివరించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. మాట తప్పం మడమతిప్పమని గొప్పలు చెప్పుకునే నాయకులు పార్లమెంట్‌లో ఒక మాట, ఇక్కడో మాట మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలతో కాకుండా కార్మిక సంఘాలతో ఏర్పాటైన జేఏసీ పోరాటానికి అండగా ఉండాలని పవన్‌ సూచించారు. ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మనందరం కలిసి పోరాటం చేద్దామని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.