యాప్నగరం

Pawan Kalyan అరుదైన రికార్డ్.. ఫాలోయింగ్‌లో సీఎం జగన్ను మించి..

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు అందుకున్నారు. పవన్‌కు ట్విట్టర్‌లో 4 మిలియన్ల ఫాలోవర్లు దాటారు.

Samayam Telugu 11 Jul 2020, 9:13 pm
జనసేన పార్టీ అధినేత సోషల్ మీడియాలో మరో మైలురాయి అందుకున్నారు. ట్విట్టర్ అకౌంట్‌లో 4 మిలియన్ల (40 లక్షల మంది) ఫాలోవర్లను సాధించారు. ఈ సందర్భంగా తనను అనుసరిస్తున్న వారిని మార్పు కోరుకుంటున్న వారిగా అభివర్ణించారు. తనను ఫాలో అవుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


జనసేన పార్టీ మార్పు కోసం నిలబడే కాంతి ఐకాన్ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దేశ స్వతంత్ర్య పోరాటం, మన రాజ్యాంగం ఆదర్శాలు, సనాతన ధర్మ విలువల ప్రేరణతో జనసేన పార్టీ రాజకీయాల్లో అడుగు పెట్టింది. మేము రాజకీయ ప్రయాణం చేసింది తక్కువే అయినా మాకు రాజకీయాలు అంటే జాతీయ సేవేనని పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయాలు విభజనవాద, రాజకీయ పగలతో ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. సోషల్ మీడియా సైతం బూతులు, ద్వేషం, నిందాపూరితంగా విషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ మార్పు కోసం వెలుగుతున్న దీపంలా నిలిచిందని పేర్కొన్నారు. మార్పు కోరుకుంటునే 40 లక్షల మంది ఒకే దృష్టిని పంచుకుంటున్న, బాధ్యతాయుతమైన, జవాబుదారీ రాజకీయాలకు నిలబడ్డ వారికి నా కృతజ్ఞతలు’ అని ట్విట్టర్ వేదికగా పవన్ రాసుకొచ్చారు.

కాగా, పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తర్వాత అత్యధిక మంది ఫాలోవర్లు సాధించిన నేతగా కొనసాగుతున్నారు. చంద్రబాబుకు ట్విట్టర్‌లో 4.7 మిలియన్ల (47 లక్షల మంది) పాలోవర్లు ఉండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి 1.6 మిలియన్ల (16 లక్షల) మంది ఫాలోవర్లు ఉన్నారు. నారా లోకేష్‌కు కేవలం 7.82 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.