యాప్నగరం

10 రోజుల్లోనే జనసేన ట్విస్ట్.. టార్గెట్ జగన్ సర్కార్

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందంటూ బీజేపీ, జనసేనలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా వైరస్‌ను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదన్నారు.

Samayam Telugu 13 Jul 2020, 12:48 pm
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జనసేన, బీజేపీ నేతలు సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, కరోనా కట్టడి అంశంతో పాటూ ప్రజా సమస్యలపై చర్చించారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందంటూ బీజేపీ, జనసేనలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా వైరస్‌ను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటున్నారు. కరోనా నివారణలో ఎక్కడ లోటుపాట్లు ఉంటే అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించారు.
Samayam Telugu పవన్, నాదెండ్ల


ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లబ్ధిదారులకు అందించ లేకపోయిందని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 9 వేల కోట్ల రూపాయలను అందించిందని సమావేశం గుర్తు చేసింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాలని, దీని కోసం కార్యాచరణను సిద్ధం చేయడానికి కొద్ది రోజులలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక టీటీడీలో ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ భూములు, గుంటూరు మార్కెట్‌ అమ్మకం, విద్యుత్‌ బిల్లుల విషయంలో బీజేపీ, జనసేన పోరాటంపై సంతృప్తి వ్యక్తం చేసింది.

పది రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై ప్రశంసలకు కురిపించారు. కొత్తగా 108, 104 వాహనాలను ప్రారంభించడంతో పాటూ కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారు. మళ్లీ ఇంతలోనే కరోనా విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.