యాప్నగరం

కాపులు బలపడటం కొన్ని వర్గాలకు ఇష్టం లేదు.. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.. పవన్ సంచలన వ్యాఖ్యలు

కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళమెత్తారు.

Samayam Telugu 27 Jun 2020, 11:40 pm
కాపు రిజర్వేషన్ల అంశం స్వార్థ రాజకీయపరుల గుప్పెట్లో నలిగిపోతోందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలపై పవన్‌ కల్యాణ్‌ శనివారం ట్విటర్‌ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపులపై జగన్‌ సర్కారుది కపట ప్రేమ అని విమర్శించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


బ్రిటివ్ వారి పరిపాలనలోనే వెనుకబడిన కులాలు (బీసీ)గా ఉన్న కాపుల్ని 1956లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బీసీ జాబితా నుంచి తొలిగించారని గుర్తు చేశారు. ఆ తర్వాత అణగారిన వర్గాల నుంచి వచ్చిన దామోదరం సంజీవయ్య 1961లో కాపులకు తిరిగి రిజర్వేషన్లు ప్రదానం చేస్తే.. ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి మళ్లీ రిజర్వేషన్లు తొలగించారని గుర్తు చేశారు.

‘‘కాపులు ఆర్థికంగా బలపడటం కొన్ని వర్గాలకు ఇష్టం లేదు. ఈబీసీ కేటగిరీలో గతంలో చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం కోటానూ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ తొలగించారు. కాపు రిజర్వేషన్లను జగన్‌ సర్కారు ఎందుకు పునరుద్ధరించడం లేదు. వైసీపీలో కాపు నేతలు రిజర్వేషన్ల అంశంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లను పునరుద్ధరించాలి’’ అని పవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.