యాప్నగరం

Pawan Kalyanకు వదిన సురేఖ మద్దతు

పవన్ పిలుపు మేరకు సాయంత్రం దీపారాధన చేసి ఫోటోలు తీసుకుని #Bharathiya_culture_matters హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. పవన్ పిలుపునకు స్పందించిన సురేఖ తులసి మొక్కకు పూజ చేశారు.

Samayam Telugu 12 Sep 2020, 6:47 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునకు.. ఆయన వదిన, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ మద్దతు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ.. శుక్రవారం సాయంత్రం అందరూ 05.30 నుంచి 06.30 గంటల మధ్య దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు సాయంత్రం దీపారాధన చేసి ఫోటోలు తీసుకుని #Bharathiya_culture_matters హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. పవన్ పిలుపునకు స్పందించిన సురేఖ తులసి మొక్కకు పూజ చేశారు. ఆ ఫొటోను రామ్ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఇటు పవన్ కళ్యాణ్ కూడా దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ధర్మాన్ని పరిరక్షిద్దాం–మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. 1893,11 సెప్టెంబర్...స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో- మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం 'ధర్మాన్ని పరిరక్షిద్దాం - మతసామరస్యాన్ని కాపాడుకుందాం' అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా మద్దతుగా దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. అంతేకాదు గురువారం రోజు పవన్‌తో పాటూ బీజేపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.