యాప్నగరం

అతడితో జనసేనకు సంబంధం లేదు.. ఇలా చేస్తే ఊరుకునేది లేదు.. పార్టీ ప్రకటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తానన్న వ్యక్తిపై జనసేన ప్రకటన!

Samayam Telugu 21 Jan 2022, 9:54 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మానవబాంబుగా మారి చంపేస్తానంటూ ట్వీట్లు చేసిన వ్యక్తిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తరుణంలో జనసేన పార్టీ రియాక్ట్ అయింది. సదరు వ్యక్తి తాను జనసేన సానుభూతి పరుడినని, పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని విచారణలో చెప్పిన తరుణంలో ఈ వ్యవహారంపై జనసేన పార్టీ రియాక్ట్ అయింది. సీఎం జగన్‌ను చంపుతానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అలాగే, పార్టీ కార్యకర్తలకు జనసేన పలు సూచనలు చేసింది.
Samayam Telugu జనసేన లోగో



‘‘సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రిని చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుంది.

సీఎం జగన్‌ను చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, ఉద్యోగానికి లీవ్ పెట్టినా..!
పార్టీ సానుభూతిపరుడు... పార్టీ అధ్యక్షుల వారి అభిమాని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసేవారిపట్ల జనసేన నాయకులు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని... వాస్తవిక, విశ్లేషణాత్మక దృక్పథంతో, ఆలోచన కలిగించేలా, చైతన్యపరచే విధంగా పోస్టులు ఉండాలని జనసేన పార్టీ అభిలషిస్తుంది.’’ అని జనసేన పార్టీ మీడియా విభాగం సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.