యాప్నగరం

YS Jagan నిర్ణయంతో జనసైనికులు ఫుల్ ఖుషీ.. కారణం ఏంటంటే!

ఇది తమ విజయం అంటోంది జనసేన పార్టీ. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేఖ వల్లే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. జనసేన పోరాటం వల్లే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందంటున్నారు.

Samayam Telugu 8 Jul 2020, 8:28 am
జగన్ సర్కార్ నిర్ణయంతో జనసైనికులు ఖుషీ అవుతున్నారు. క్రెడిట్ మాత్రం తమ అధినేత పవన్ కళ్యాణ్‌కు దక్కుతుందంటున్నారు. పవన్ గ్రేట్ అంటూ ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నారు. జనసైనికుల ఆనందానికి కారణం ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తంకు నిధులు విడుదల చేయడమే కారణం. ప్రభుత్వం మార్చి నుంచి జూన్‌ వరకు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద జూనియర్‌ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్‌ 3న సీఎం జగన్ ప్రారంభించారు.
Samayam Telugu జగన్, పవన్


Read Also: ఏపీలో ఆ పథకానికి పేరు మార్పు.. అప్పుడు చంద్రన్న, ఇప్పుడు జగనన్న

ఈ నెల 5న పవన్ కళ్యాణ్ లా నేస్తం పథకం అమలు జరగడం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది నెలలుగా లాయర్లకు ఆర్థిక సాయం నిలిచిపోయిందని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సాయం చేయాలని కోరారు. జనసేనాని లేఖ రాసిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం నిధుల విడుదల చేసింది. అందుకే ఇది తమ విజయం అంటోంది జనసేన పార్టీ. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేఖ వల్లే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. జనసేన పోరాటం వల్లే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందంటున్నారు.

Also Read: నెల్లూరు: మహిళా ఎస్సైతో గ్రామ వాలంటీర్ అసభ్య ప్రవర్తన


Must Read: పేదవాడి గుండె చప్పుడు వైఎస్‌ఆర్.. సంక్షేమంతో చరిత్రలో చెరగని ముద్ర

లా నేస్తం పథకానికి గత నాలుగు నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో జులై 5 న జనసేన అధినేత స్పందించారని.. జులై 7న ప్రభుత్వం నాలుగు నెలల బకాయిలని విడుదల చేసిందని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. సమస్యని పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు, పెండింగ్ లో పెట్టకుండా ఇక ముందు ప్రతి నెలా నిధులు విడుదల చెయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.