యాప్నగరం

మీ ఆరోగ్యం జాగ్రత్త.. మీతో చాలా పని ఉంది: వైసీపీ ఎంపీకి నాగబాబు జాగ్రత్తలు

మీ సెక్యూరిటీ కూడా మాస్కులు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 'ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా మీతో.. మీకు మాస్క్ ఉన్నా జనం గుర్తు పడతారు.. నేను గారంటీ' అన్న నాగబాబు.

Samayam Telugu 23 Apr 2020, 10:41 am
విజయసాయిరెడ్డి వర్సెస్ నాగబాబు.. మొన్నటి వరకు ట్విట్టర్ వేదికగా పెద్ద రగడే జరిగింది. ఇద్దరి మధ్య వార్ పీక్స్‌కు చేరింది.. చివరికి నాగబాబు చొరవ తీసుకుని ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు. అంతటితో వివాదం సమసిపోయింది. 10 రోజలు పాటూ గ్యాప్ ఇచ్చిన నాగబాబు మళ్లీ విజయసాయిని టార్గెట్ చేశారు. మళ్లీ ట్వీట్ వార్ మొదలు పెట్టారు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ విజయసాయిరెడ్డి మాస్క్‌కు లింక్ పెట్టి సెటైర్లు పేల్చారు జనసేన పార్టీ నేత.
Samayam Telugu jpg.


విజయ సాయి రెడ్డి.. మాస్క్ ముక్కు నోటికి పెట్టుకోండి.. గొంతుకి కాదు అన్నారు నాగబాబు. ఒక వేళ మీరు asymptomaticఅయినా ప్రాబ్లెమ్ ఉండదు. మీ సెక్యూరిటీ కూడా మాస్కులు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 'ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా మీతో.. మీకు మాస్క్ ఉన్నా జనం గుర్తు పడతారు.. నేను గారంటీ' అంటూ సెటైర్లు పేల్చారు మెగా బ్రదర్.
పదిరోజుల క్రితం విజయసాయిరెడ్డి-నాగబాబుల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. పవన్, జనసేనపై విజయసాయి చేసిన ట్వీట్‌తో మెగా బ్రదర్ స్పందించారు. తర్వాత ఇద్దరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. రెండు రోజుల పాటూ ఈ యుద్ధం జరిగింది. కరోనా వంటి కష్టకాలంలో ఇలా కుటిల రాజకీయ నాయకుల చెత్త విమర్శలపై తాను స్పందించాలనుకోవడం లేదని.. జనసేన కార్యకర్తగా, ఒక బ్రదర్‌గా తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు.. ప్రజలు మీకు బుద్ది చెప్పే రోజు వస్తుంది అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.