యాప్నగరం

Atchannaidu అరెస్ట్‌పై స్పందించిన జనసేన.. ఆసక్తికర ప్రకటన

అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది అన్నారు.

Samayam Telugu 12 Jun 2020, 2:06 pm
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై జనసేన పార్టీ స్పందించింది. ఆ పార్టీ తరపున రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి అన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోందని అనుమానాలను వ్యక్తం చేశారు.
Samayam Telugu అచ్చెన్నాయుడు

అలాగే ఒక శాసనసభ్యుడిని అరెస్ట్‌ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు మనోహర్. అచ్చెన్నాయుడు గారి అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయని.. ఈ.ఎస్‌.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది అన్నారు.

శుక్రవారం ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. అయితే అచ్చెన్నకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని.. కనీసం మందులు వేసుకోనివ్వకుండా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాలేదంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.