యాప్నగరం

లోకేష్‌ను కాదని పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తారా: కేఏ పాల్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌ను కాదని పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు సీఎం చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 16 Jan 2023, 6:05 pm
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు అసలు బుర్ర ఉందా అని ఫైరయ్యారు. తన ఓటమికి ప్రజలే కారణమని పవన్‌ కళ్యాణ్ మాట్లాడటం ఆయన తెలివి తక్కువతనం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
Samayam Telugu కేఏ పాల్ (ఫైల్ ఫొటో)


ఈ మేరకు సోమవారం కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. మీకు ఓట్లు వేయకపోతే ప్రజలును తిట్టేస్తావా అని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారనే కారణంతో తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలనే కండీషన్‌తో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానని చెప్పడం పెద్ద తప్పు అన్నారు. మీకు పదవులు ఇస్తామని హామీ ఇస్తే ఎవరి పార్టీలోకి అయినా వెళ్లిపోతావా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తామని ఏ పార్టీ అయినా చెబితే వారికే సపోర్ట్‌ చేస్తావా అని నిలదీశారు.

అసలు, చంద్రబాబు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానంటే ఎలా నమ్మావని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ ప్రశ్నించారు. తన కొడుకు లోకేష్‌ను కాదని మిమ్మల్ని ఎలా సీఎం చేస్తారని సెటైర్లు వేశారు. కనీస జ్ఞానం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు తెలివి తేటలను ఇచ్చాడని, దాని వాడాలని పవన్‌కే కేఏ పాల్ సూచించారు. ప్రజలను మోసం చేయడానికే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తెలివైన వారు తనను అసలు గెలిపించరని విమర్శించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.