యాప్నగరం

కాకినాడ: మహిళకు మున్సిపల్ కమిషనర్ రిటర్న్ గిఫ్ట్.. పాపం దిమ్మ తిరిగింది

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మున్సిపల్ కమిషనర్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటో స్వయంగా చూపెట్టారు. మున్సిపల్ కమిషనర్ రిటర్న్ గిఫ్ట్‌తో మహిళకు దిమ్మ తిరిగింది.

Samayam Telugu 6 Nov 2020, 8:06 am
మహిళకు మున్సిపల్ కమిషనర్ రిటర్న్ గిఫ్ట్ ఏంటి.. దిమ్మ తిరగడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్.. రోడ్డుపై చెత్త వేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు అవగాహన కార్యక్రమాలు పెట్టిన వినిపించుకోవడం లేదు. అందుకే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మున్సిపల్ కమిషనర్ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటో స్వయంగా చూపెట్టారు.

కాకినాడలో రోడ్డుపై చెత్త వేసి వెళ్ళిపోతున్న వారిని చూసి కాకినాడ మున్సిపల్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెత్త వేసేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. ఓ మహిళ రోడ్డుపై చెత్త వేసి వెళ్ళిపోయింది.. గమనించిన మున్సిపల్ కమిషనర్ దినకర్ ఆ చెత్తను తీసుకెళ్లి సదరు మహిళ ఇంటి ముందు వేసి ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా ఉంది అని అడిగారు. అంతేకాదు మరోసారి ఇలా చెత్తను రోడ్డుమీద వేస్తే జరిమానా విధిస్తానని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ రిటర్న్ గిఫ్ట్‌తో మహిళకు దిమ్మ తిరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.