యాప్నగరం

తూర్పుగోదావరిలో టీడీపీకి షాక్.. నేడు వైసీపీలోకి చలమలశెట్టి

లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలన్న ఆయన కల మూడుసార్లూ ఫలించలేదు. మూడుసాార్లు వేర్వేరు పార్టీల నుంచి ఆయన పోటీచేసినాా నిరాశే ఎదురయ్యింది.

Samayam Telugu 10 Aug 2020, 9:37 am
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్‌ సోమవారం సీఎం జగన్‌ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన సునీల్.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం చవిచూశారు. అప్పటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. 2022లో రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుండగా.. ఆ స్థానంలో సునీల్‌కు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికార పార్టీతో ఆయన ఇటీవల మంతనాలు సాగించినట్టు సమాచారం.
Samayam Telugu చలమలశెట్టి సునీల్


ఇప్పటి వరకూ కాకినాడ లోకసభ స్థానం నుంచి చలమలశెట్టి సునీల్ మూడుసార్లు పోటీచేయగా.. అన్ని సందర్భాల్లో ఆయనకు పరాజయం ఎదురయ్యింది. 2014 సాధారణ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌.. టీడీపీ అభ్యర్థి తోట నర్సింహం చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక, తొలిసారి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన చలమలశెట్టి.. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో 30 వేల ఓట్లతో ఓటమి చవిచూశారు. 2014 ఎన్నికల అనంతరం పరిణామాలతో ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల ముందే టీడీపీలో చేరి కాకినాడ పార్లమెంట్‌కు పోటీచేశారు. అయినా ఆయనకు నిరాశే ఎదురయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.