యాప్నగరం

నన్ను దేశద్రోహి అనుకోవద్దు.. రైతు ఉద్యమంపై ప్రధాని మోదీకి ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ

దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.

Samayam Telugu 8 Dec 2020, 6:01 pm
దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల పట్టుదలకు పోకుండా మనసు పెట్టి ఆలోచించాలని కోరారు. చట్టాలు చేయాల్సింది.. అణగారిన వర్గాల కోసమే కానీ, పారిశ్రామిక వర్గాల ప్రయోజనం కోసం కాదని తేల్చి చెప్పారు.
Samayam Telugu ముద్రగడ పద్మనాభం, ప్రధాని నరేంద్ర మోదీ


రైతుల సమస్యను తమ దృష్టికి తెస్తున్నందుకు తనను దేశద్రోహిని అనుకోవద్దని లేఖలో ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. దేశ ప్రజల సమస్యలు మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారని ప్రశ్నించారు. రైతులు ఉద్యమం చేయడం తమ మనసును నొప్పించి ఉంటే వారిని పెద్ద మనసుతో క్షమించాలన్నారు.

మీ పిలుపు మేరకు రైతులు ఇప్పటికే చాలా మెట్లు దిగి మీ (ప్రభుత్వం) వద్దకు వచ్చారని ముద్రగడ్డ పద్మనాభం పేర్కొన్నారు. రైతుల కోసం తమరు ఒక మెట్టు దిగినా తప్పులేదని ప్రధాని మోదీని కోరారు. దాని వల్ల తమ కీర్తి కలకాలం ఉంటుందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. దేశానికి అన్నదాత వెన్నెముక అంటారని, అలాంటి అన్నదాతను కాపేడేలా తమరి నిర్ణయాలు ఉండాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.