యాప్నగరం

టీడీపీ ఎంపీ పెద్ద మనసు.. కరోనా సాయం కింద రూ.5కోట్లు

పెద్ద మనసు చాటుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని. తన ఎంపీ నిధుల నుంచి రూ.5కోట్లు కరోనా సాయం కింది అందిస్తానని చెప్పిన ఎంపీ. ప్రతిపాదనలు పంపాలని కోరిన బెజవాడ ఎంపీ.

Samayam Telugu 23 Mar 2020, 8:18 pm
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటూ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాలు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా వాహనాలను అనుమతించడం లేదు. లాక్‌డౌన్ దెబ్బకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.
Samayam Telugu tdp


తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని తనవంతు సాయాన్ని ప్రకటించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.5కోట్లను కరోనా సాయానికి అందజేస్తానని ప్రకటించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ నివారణకై సహాయక చర్యల నిమిత్తం ఇవ్వాలనుకుంటున్నట్లు ఎంపీ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదనలు వెంటనే పంపాలని కోరారు.
గతంలో కూడా ఎంపీ నాని తన ఎంపీ నిధుల నుంచి స్థానికంగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయించారు. మైలవరం నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు కష్టకాలంలో మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.. తన ఎంపీ నిధుల నుంచి రూ.5కోట్లు కేటాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.