యాప్నగరం

జగన్ రెడ్డి గారు.. మేం వాటిని సన్మానాలుగా భావిస్తాం: టీడీపీ ఎంపీ

'టీడీపీ ఎంపీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత మీకే దక్కుతుంది. ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లు అవుతుంది' అన్న ఎంపీ కేశినేని నాని

Samayam Telugu 23 Jan 2020, 10:53 am
జగన్ సర్కార్ తీరుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. తనపై, తమ పార్టీ ఎంపీలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. అమరావతి రైతుల తరపున పోరాటం చేస్తున్న తమపై కక్షగట్టారని ఆరోపించారు. కేసుల అంశాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.
Samayam Telugu mps


అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్రం కోసం రైతులు కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, కనమేడల రవీంద్ర, తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ‘నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో’అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
గత మూడు రోజులుగా అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడంతో.. రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ను అమలు చేసింది. ముందుగానే టీడీపీ ఎంపీలు, నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసెంబ్లీవైపు వచ్చారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.. పోలీసుల ఆంక్షలు అమల్లో ఉండటంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరపర్చగా.. రిమాండ్ విధించారు. తర్వాత బెయిల్ రావడంతో విడుదలయ్యాయి. మరోవైపు తనపై, ఎంపీ కనకమేడల రవీంద్రపై కూడా కేసులు నమోదు చేసినట్లు కేశినేని నాని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.