యాప్నగరం

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ.. కీలక ఆదేశాలు జారీ

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

Samayam Telugu 30 Jul 2020, 1:54 pm
ఏపి ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలను సైతం జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ముందుకెళ్లొద్దని బోర్డు తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు పూర్తి నివేదికను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ కు నివేదికను పంపాలని… అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మాణాన్ని చేపట్టాలని తెలిపింది.
Samayam Telugu ఏపీ సీఎం జగన్
ap cm jagan mohan reddy


అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపడుతోందని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైందని తాజాగా మరోసారి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ముందుకెళ్ల వద్దని తాము గతంలోనే తెలిపామన్న బోర్డు.. ప్రాజెక్టు డీపీఆర్‌ కూడా తమకు అందించలేదని లేఖలో పేర్కొంది. ఈ మేరకు ఏపి ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు కృష్ణ బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు.
Read More: జగన్‌ ఎదురు ప్రశ్నలు సరికాదు.. వైసీపీ ఎంపీ రఘురామ విమర్శలు
దీంతో ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంపై నీళ్లు చల్లినట్టైంది జలవనరులశాఖపై ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.