యాప్నగరం

ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు.. కలెక్టర్ తీవ్ర హెచ్చరికలు.. కంట్రోల్ రూం నంబర్లు ఇవే!

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు.

Samayam Telugu 13 Aug 2020, 11:22 pm
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ఇంతియాజ్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
Samayam Telugu వర్షం జోరు


ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగంతో సహకరించి వారు జారీ చేసిన సూచనలు పాటించాలని కోరారు.

కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు ఇవే..
మచిలీపట్నం కలెక్టరేట్: 08672-252572
విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం: 0866 - 2474805
సబ్ కలెక్టర్ ఆఫీస్, విజయవాడ : 0866-2574454
సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు: 08656- 232717
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, మచిలీపట్నం: 08672-252486
రెవిన్యూ డివిజనల్ ఆఫీస్, గుడివాడ: 08674 - 243697

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.