యాప్నగరం

శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల మీది నుంచి దూకుతున్న కృష్ణమ్మ

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల మీదుగా నీరు ప్రవహిస్తోంది.

Samayam Telugu 10 Sep 2019, 11:19 am
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 6 గేట్లను 17 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల నిర్వహణలో అలసత్వం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. కానీ దీనివల్ల డ్యామ్ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ చెబుతున్నారు.
Samayam Telugu srisailam gates


శ్రీశైలం జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 215.32 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 28,500 క్యూసెక్కులు, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రానికి 42378 క్యూసెక్కులు, కుడి జలవిద్యుత్ కేంద్రానికి 39655 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.