యాప్నగరం

కరోనా: అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చుకుడికి వైర సోకింది. దీంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మఠం పెద్దల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Samayam Telugu 22 Jun 2020, 10:58 am
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత రెండు మూడురోజులుగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ తప్పడం లేదు. అంతేకాదు ఆలయాల్లో పనిచేసే అర్చకులపైనా కరోనా ప్రభావం కనిపిస్తుంది. ఇటీవల వరుసగా జరిగిన ఘటనలు కలకలంరేపాయి.
Samayam Telugu అహోబిలం ఆలయం


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్థారణకాగా.. తాజాగా కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చుకుడికి వైర సోకింది. దీంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మఠం పెద్దల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తర్వాత దర్శనం కల్పిస్తామన్నారు. అంతేకాదు అర్చకుడికి సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.