యాప్నగరం

కర్నూలులో మరో కరోనా పాజిటివ్‌.. 337కు చేరిన కేసులు

Kurnool Coronavirus Case: కర్నూలు జిల్లాలో కరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో జిల్లాలో కరోనా కేసులు 75కు చేరాయి.

Samayam Telugu 8 Apr 2020, 8:18 pm
కర్నూలు జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్‌ వీర పాండ్యన్‌ వెల్లడించారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 75కి చేరుకుంది. అలాగే అనంతపురం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు వైద్య సిబ్బందికి సైతం ఈ మహమ్మారి సోకినట్టు నిర్దారణ అయినట్లు తెలిపారు.
Samayam Telugu corona ward


Also Read: తెలంగాణలో 453కి కరోనా కేసులు.. ఒక్కరోజులో 49 మందికి..

కర్నూలులో గత శనివారం వరకు నాలుగుగా ఉన్న కరోనా వైరస్ కేసులు ఒక్క సారిగా పెరిగిపోయాయి. దీంతో బుధవారం సాయంత్రానికి కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా కేసులు 75కు చేరుకున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు.

ఈ రెండు జిల్లాల్లో నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 337కు చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన రిపోర్టులో 329 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రం విడుదలైన రెండు కేసులతో మొత్తం 337 కేసులు నమోదయ్యాయి.

Also Read: ఏపీలో హైఅలర్ట్: గుంటూరులో 49 కరోనా పాటిజివ్.. మొత్తం 348 కేసులు

Also Read: అనంతపురంలో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌.. ఒక్కసారిగా పెరిగిన కేసులు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.