యాప్నగరం

వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం

వైసీపీ నేత నివాసంలో 1200 మద్యం సీసాలు.. కారును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరంచేశారు. ఈ మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నదానిపై ఆరా తీస్తున్నారు.

Samayam Telugu 7 Apr 2020, 11:39 am
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. సాయంత్రానికి చుక్కలేక పిచ్చెక్కిపోతున్నారు. అయితే మద్యం కోసం జనాలు తహతహలాడుతున్నవేళ ప్రకాశం జిల్లాలో ఓ వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లో మద్యం బాటిళ్లు బయటపడటం కలకలంరేపింది. గిద్దలూరు మండలం గడికోటలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు దొరికాయి. మద్యం బాటిళ్లు ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సీఐల నేతృత్వంలోసోదాలు నిర్వహించారు.
Samayam Telugu liquor bottles seized in ysrcp leader house at prakasam district
వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం


శ్రీనివాస్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నివాసంలో 1200 మద్యం సీసాలు.. కారును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరంచేశారు. ఈ మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నదానిపై ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ దెబ్బకు మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దాదాపు రెండు వారాలుగా షాపులు లేకపోవడంతో చుక్క పడక మందుబాబులు చుక్కలు చూస్తున్నారు.. పిచ్చెక్కిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కొంతమంది మందుబాబులు ఒత్తిడిని తట్టుకోలేక ఏది పడితే అది తాగి ప్రాణాలు తీసుకున్నారు. కొంతమంది మాత్రం కల్లుతో మద్యం లేని లోటును భర్తీ చేసుకుంటున్నారు. ఇలా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. మద్యం దొరక్క కొంతమందు ఆకతాయిలు ప్రభుత్వ మద్యం షాపులపై పడుతున్నారు. షాపుల్లో చొరబడి లూటీలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకడం సంచలనంరేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.