యాప్నగరం

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్షాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు., కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవాకశాలు ఉన్నాయి.

Samayam Telugu 7 Jun 2020, 9:58 am
దేశంలో నైరుతి పవనాలు చరుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు, తూర్పుమధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం తో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నది.
Samayam Telugu rain news.


నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వచ్చే మూడ్రోజుల్లో కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మొత్తం ప్రాంతాలు, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావంతో రెండు రోజుల్లో కోస్తాంధ్ర, సీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మరోవైపు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.