యాప్నగరం

ప.గో జిల్లా: అంత్యక్రియలకు హాజరైన 15 మందికి కరోనా

చింతలపూడిలోని కొవ్వూరు గూడెం ఏరియాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ వ్యక్తి వ్యక్తి దహన సంస్కారాలకు అతని కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.

Samayam Telugu 28 Jul 2020, 12:00 pm
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రకటిత లాక్‌డౌన్ అమల్లో ఉంటోంది.. నిబంధనల్ని పక్కగా పాటించేలా చూస్తున్నారు. జనాలు రోడ్లపైకి రాకుండా.. ఉదయం కొద్దిసేపు మాత్రమే నిత్యావసరాలకు అవకాశం కల్పిస్తున్నారు. మాస్క్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలపై ఫోకస్ పెట్టారు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు.. ఇక పాలు, మెడికల్‌తో పాటూ అత్యవసరాలకు మాత్రం అనుమతి ఉంటుంది.
Samayam Telugu పశ్చిమగోదావరి జిల్లా


మరోవైపు కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు చిత్ర విచిత్రంగా విస్తరిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా అలాంటి ఘటనే జరిగింది. చింతలపూడిలోని కొవ్వూరు గూడెం ఏరియాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ వ్యక్తి వ్యక్తి దహన సంస్కారాలకు అతని కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. అంతిమ సంస్కారాలకు హాజరైన వారికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 15 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. వీరంద్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఏకంగా 15మందికి కరోనా రావడం కలకలంరేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.