యాప్నగరం

ప.గో: ప్రాణం తీసిన స్కూటీ స్టాండ్.. ఏం జరిగిందంటే!

చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. స్కూటర్ స్టాండ్ తీయకపోవడంతో రోడ్డు ప్రమాదం. అక్కడిక్కడే చనిపోయిన వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపిన ఘటన.

Samayam Telugu 5 Sep 2020, 2:29 pm
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్కూటీ స్టాండ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పాలకోడేరు మండలం పెన్నాడలో శుక్రవారం భీమవరానికి చెందిన దుర్గారావు పాలకొల్లు వైపు నుంచి స్కూటీపై వెళుతున్నాడు. పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ప్రమాదం జరిగింది. స్కూటీ స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి కింద పడిపోయాడు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు వెంటనే 108కు సమాచారం అందించారు. భీమవరం నుంచి 108 వాహనం వచ్చేలోపే అతడు చనిపోయాడు.
Samayam Telugu ఏలూరులో విషాదం


కొద్దిసేపటి తర్వాత 108 సిబ్బంది వచ్చి చనిపోయాడని చెప్పి వెనుతిరిగారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి తలకు తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. స్టాండ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బైక్‌లపై వెళ్లే సమయంలో స్టాండ్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.